: రాజ్యసభ పోటీలో రాష్ట్రం నుంచి స్వతంత్ర అభ్యర్థి!


రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్సీ చైతన్యరాజు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తాను స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు హైదరాబాదులో ప్రకటించారు. ఈ నెల 27న లేదా 28న నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఇప్పటికే రెండు జతల నామినేషన్ పత్రాలపై పలువురు ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నట్లు చెప్పారు. అంతకుముందు ఆయన మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి ఆరుగురి పదవీకాలం పూర్తవనుంది. వాటిలో మూడు కాంగ్రెస్ నుంచి, రెండు టీడీపీకు వెళతాయి. ఇక మిగిలిన ఒక్క స్థానానికే చైతన్యరాజు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News