: టీవీ చూసి గిన్నిస్ రికార్డు
గిన్నిస్ రికార్డు సాధించేందుకు సాహసవంతులు చేయని పని ఉండదు. తాజాగా అమెరికాకు చెందిన ముగ్గురు వ్యక్తులు టీవీ చూస్తూ గిన్నిస్ రికార్డు సృష్టించేశారు. డాన్ జోర్డాన్, స్పెన్సర్ లార్సన్, క్రిస్ లాలిస్ లు ఐదు రోజుల్లో 87 గంటలపాటు నిరవధికంగా టీవీ చూసి పాత రికార్డు(86 గంటలు)ను బద్దలు కొట్టారు. అమెరికాలోని నెవెడా రాష్ట్రంలో లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్ లో ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో వీరు గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.
గిన్నిస్ నిబంధనల ప్రకారం వీరికి గంటకు ఐదు నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. టీవీ చూస్తున్నంతసేపూ ఛానెల్స్ మార్చుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఆ సమయంలో పుస్తకాలు కానీ పేపర్లు కానీ చదవకూడదు. ఫోన్ మాట్లాడకూడదు. వీరు ఈ రూల్స్ పాటిస్తూనే 87 గంటలపాటు టీవీ చూసి రికార్డు సృష్టించారు. దీంతో 2012లో లాస్ ఎంజిల్స్ లో కారిన్ శ్రీవేస్, జెరేమియా ఫ్రాంకోలు నెలకొల్పిన 86 గంటల రికార్డు బద్దలైపోయింది.