: మరో రెండు వికెట్లు కోల్పోయిన భారత్
మోహాలీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ నాలుగోరోజున భారత ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. భోజన విరామానికి మూడు వికెట్లు కోల్పోయిన భారత్ అనంతరం బ్యాటింగ్ చేపట్టగానే మురళీ విజయ్ వికెట్ ను కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్ లో ఎల్బీగా మురళీ అవుటయ్యాడు. అయితేనేమి అప్పటికే మురళీ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 153 పరుగులు సాధించాడు.
తర్వాత బ్యాటింగుకి దిగిన కెప్టెన్ ధోనీ కూడా సరిగ్గా స్టార్క్ బౌలింగ్ లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో వరుసగా ఇద్దరి వికెట్లను తీసుకుని ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ(17), రవీంద్ర జడేజా(3) కలిసి ఆటను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 420 పరుగుల వద్ద ఉంది.