: ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న బెంగళూరు నగరం


దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగళూరు ప్రపంచ దృష్టినీ ఆకర్షిస్తోంది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ నగరంగా బెంగళూరు ముందంజలో ఉంది. అంతేకాదు అత్యంత ఆకర్షణీయమైన 10 నగరాలలో ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణెలు కూడా ఉన్నాయి. థోలోన్స్ అనే కన్సల్టింగ్ కంపెనీ ఈ వివరాలను వెల్లడించింది. భారత్ లోని టైర్-2 నగరాలు, ఫిలిప్పీన్స్, పోలండ్, దక్షిణ అమెరికాలోని పట్టణాలు కూడా ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నట్లు థోలోన్స్ వెల్లడించింది. చండీగఢ్(23), కోల్ కతా(25), జైపూర్(38), అహ్మదాబాద్(63) తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నాయి.

  • Loading...

More Telugu News