: మణప్పురం ఇంటి దొంగలు దొరికారు
అనంతపురంలోని మణప్పురం ఫైనాన్స్ ఇంటి దొంగలు పోలీసుల చేతికి చిక్కారు. మణప్పురం ఫైనాన్స్ అసిస్టెంట్ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 3.25 కిలోల బంగారం, మూడు లక్షల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మణప్పురం సొమ్మును క్రికెట్ బెట్టింగుల కోసం ఖర్చు చేసినట్టు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం వున్న మరో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.