: అక్కడి నుంచి శివాజీ గణేశన్ విగ్రహం తొలగించండి: మద్రాస్ హైకోర్టు


చెన్నైలో కామరాజ్ వీధిలో ఉన్న ప్రఖ్యాత నటుడు శివాజీ గణేశన్ విగ్రహం తొలగించాలని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ సతీష్ కె.అగ్నిహోత్రి, జస్టిస్ కె.కె.శశిధరన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. శివాజీ గణేశన్ విగ్రహం తొలగించకుండా అధికారులను ఆదేశించాల్సిందిగా కోరుతూ 2006లో శ్రీనివాసన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా.. మెరీనా జంక్షన్ లో ఉన్న ఆ విగ్రహం ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తోందని, వాహనదారులకు ముందున్న దారి స్పష్టంగా కన్పించక ఇబ్బంది పడుతున్నారని, దాంతో.. ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News