: సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. విభజన బిల్లుపై చర్చ పొడిగింపుకు అవకాశం ఉందా? లేదా? అనే అంశంపై వీరు చర్చిస్తున్నారు. చర్చకు సమయం కేటాయించకపోతే ఏం చేయాలి అనే దానిపై మంతనాలు చేస్తున్నారు.