: పాతబస్తీలో పెద్ద లూటీ
పాతబస్తీలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోని వారంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం గమనించిన దుండగులు ఐదు కుటుంబాల నగలు, నగదు లూటీ చేసేశారు. ఇంట్లో ఉంచిన 96 తులాల బంగారం, 1200 కెనడా కరెన్సీ, లక్ష రూపాయల నగదు, రెండు ఐ ఫోన్ లు దొంగిలించారు. చంచల్ గూడకు చెందిన మక్బూల్ అలీఖాన్ కెనడాలో 20 సంవత్సరాల క్రితం స్థిరపడ్డారు. తన కుమార్తె పెళ్లికి మరో నాలుగు కుటుంబాలతో కలిసి పాతబస్తీలోని అతని ఇంటికి వచ్చారు. వారంతా ఇంటికి తాళం వేసి ఫంక్షన్ హాలులో పెళ్లి పనులు చూసుకుంటున్నారు. అదను చూసుకుని దుండగులు ఆ ఇంటికి కన్నం వేశారు. దీంతో బాధితులు డబీర్ పుర పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.