: యూపీలోని గోరక్ పూర్ లో నేడు మోడీ ర్యాలీ
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కొన్నినెలల నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో మోడీ పాల్గొననున్నారు. అనంతరం సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ ర్యాలీకి దాదాపు మూడు లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.