: టీటీడీ అర్చకుల తొలగింపుపై హైకోర్టు స్టే


తిరుమల అర్చకులకు హైకోర్టు ఆదేశాలతో తాత్కాలిక ఊరట దక్కింది. టీటీడీ పరిధిలో 65ఏళ్లు నిండిన అర్చకులకు ఉద్యోగ విమరణ వర్తింప జేయాలని బోర్డు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొందరు అర్చకులను బలవంతంగా పదవీ విరమణ కూడా చేయించారు. టీటీడీ ఆదేశాలను వృద్ధ అర్చకులు కొందరు హైకోర్టులో సవాలు చేశారు. దీంతో టీటీడీ ఆదేశాలపై కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎవరినీ తొలగించరాదని, తొలగించిన అర్చకులను విధులలోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News