: సీఎం మాట్లాడింది సభా నాయకుడి హోదాలోనా? లేక పీలేరు ఎమ్మెల్యేగానా?: కోమటిరెడ్డి


తెలంగాణ వాదం వినిపించేందుకే తాను రాజీనామా చేశానని... సీఎం కిరణ్ కూడా తన పదవికి రాజీనామా చేసి సమైక్యవాదం వినిపించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. శాసనసభలో మాట్లాడుతూ కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సభలో ఇరు ప్రాంత ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ సభా నాయకుడి హోదాలో మాట్లాడారా? లేక పీలేరు ఎమ్మెల్యేగా మాట్లాడారా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News