: అక్కినేని మృతిపట్ల ప్రధాని మన్మోహన్ దిగ్భ్రాంతి
సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు మృతిపట్ల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీరంగానికి అక్కినేని చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.