: ఇటలీ రాయబారిని అరెస్ట్ చేయొచ్చు: హరీష్ సాల్వే


ఇటలీ నావికాదళ గార్డులను తిరిగి భారత్ కు అప్పగించే విషయంలో మాట తప్పినందుకు ఆ దేశ రాయబారి డానియెల్ మాన్సిని అరెస్ట్ చేయవచ్చని ప్రముఖ న్యాయకోవిదుడు హరీష్ సాల్వే అన్నారు. కేరళ తీరంలో ఇద్దరు జాలర్లను కాల్చి చంపినట్లు ఇద్దరు నావికాదళ గార్డులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఇటలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మళ్లీ వారు భారత్ కు తిరిగి వస్తారని ఆ దేశ రాయబారి సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన విషయాన్ని హరీష్ గుర్తు చేశారు. కరణ్ థాపర్ డెవిల్స్ అడ్వకేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హరీష్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇటలీ రాయబారి అరెస్ట్ అన్నది ఈ వ్యవహరంలో ఆ దేశం అనుసరించే తీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. 

  • Loading...

More Telugu News