: ఆంధ్రా ప్రాంతంతో కలిసిన తరువాత ఎక్కడ వెనకబడ్డారో చెప్పాలి: సీఎం
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఎక్కడ వెనకబడ్డారో తెలపాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పంచవర్ష ప్రణాళికలో దేశంలోనే రెండో అత్యధిక బడ్జెట్ ను రాష్ట్రానికి కేటాయించారన్నారు. దేశంలోనే సంక్షేమ కార్యక్రమాల్లో మనం ముందున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వనరుల రూపేణా రాష్ట్రంలో కొదువ లేదని ఆయన తెలిపారు. 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ కేటాయింపుకు వెచ్చించామని తెలిపారు. మిగిలిన అన్ని రంగాల్లో మన రాష్ట్రం స్వయం సంవృద్ధి సాధించిందని ఆయన తెలిపారు. విభజన జరిగితే ఇవి రెండు ప్రాంతాల్లో భారీగా తగ్గిపోతాయని ఆయన వెల్లడించారు.
మహిళలకు వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు పెట్టామన్నారు. అలాగే రైతులకు భూపంపిణీతో బాటు, వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించడం జరిగిందని ఆయన తెలిపారు. ఉద్యమాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పథకాలు విస్తరించలేకపోయామని ఆయన అన్నారు. ఈ పథకాలన్నీ ఆర్థిక వనరులు సంవృద్ధిగా ఉన్నాయి కనుకే చేయగలిగామన్నారు. విభజన జరిగితే ఇవి జరిగే అవకాశం లేదని కిరణ్ స్పష్టం చేశారు.