: అక్కినేని మృతికి చరణ్ సంతాపం


అక్కినేని అస్తమయానికి హీరో రాం చరణ్ సంతాపం తెలిపాడు. తాను దేశం వెలుపల ఉన్న సమయంలో అక్కినేని మృతి చెందారన్న వార్త తెలియడం చాలా దురదృష్టకరమని చెప్పాడు. దాంతో, తను స్వయంగా వచ్చి ఆ గొప్ప వ్యక్తికి నివాళులర్పించేందుకు కుదరడం లేదన్నాడు. వేరే దేశంలో ఉన్న కారణంగా మీడియా ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెర్రీ పేర్కొన్నాడు. లెజెండ్ అయిన 'నటసమ్రాట్' నిరంతరం మనందరి హృదయాల్లో జీవించే ఉంటారన్నాడు.

  • Loading...

More Telugu News