: తెలంగాణ వారికి వాస్తవాలను తెలియాజేయాల్సిన అవసరం ఉంది: సీఎం కిరణ్
శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవాలు తెలంగాణ వారి ముందు ఉంచాల్సిన అవసరముందని ఆయన సభ్యులకు తెలిపారు. సీఎం కిరణ్ ప్రసంగం, ఆయన మాటల్లోనే..
"ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి జస్టిస్ వాంఛూ కమిటీ ఏర్పాటు చేశారు. ఒక కమిషన్ ద్వారా రాష్ట్రం ఏర్పాటు చేయాలని 1952వ సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లోనే నిజామాబాద్ ఎంపీ హెగ్డా హైదరాబాదుకు రాజధానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. 1953లోనే కరీంనగర్ ఎంపీ ఎం.ఆర్.క్రిష్ణ కూడా రాజధానిగా హైదరాబాదును తీసుకోవాలని చెప్పారు. తెలంగాణలోని 8 జిల్లాలను కలిపితేనే సంపూర్ణ రాష్ట్రం ఏర్పడుతుందని కూడా క్రిష్ణ చెప్పారు" అంటూ ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది.