: నేనెందుకు వ్యతిరేకిస్తున్నానంటే...!: ముఖ్యమంత్రి
తాను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తనను ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ చేసినా... తాను ఎందుకు అధిష్ఠానాన్ని వ్యతిరేకిస్తున్నానో చెప్పాల్సిన అవసరం ఉందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తనను ముఖ్యమంత్రిగా చేసిన సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదని ఆయన తెలిపారు. తనకు కాంగ్రెస్ పార్టీ కావాలా? లేక సమైక్య రాష్ట్రం కావాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సిన క్లిష్ట పరీక్ష ఎదురయ్యిందని కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాష్ట్ర ఏర్పాటు, చరిత్ర, వాస్తవాలు అన్నీ సవివరంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ దశలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం ఫ్లోర్ లీడర్ గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? లేక ఆయన చెబుతున్న అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమా? అంటూ టీఆర్ఎస్ నేతలు వెల్ లోకి దూసుకొచ్చి సీఎం వ్యతిరేక నినాదాలు చేశారు.