: నేను ముఖ్యమంత్రిని కావడం నా దురదృష్టం: సీఎం కిరణ్
ఈ పరిస్థితుల్లో తాను ముఖ్యమంత్రిని కావడం తన దురదృష్టం అని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర చరిత్రను అవలోకించిన తాను రాష్ట్ర విభజన వల్ల ఏ వర్గానికీ మేలు జరగదని చెబుతున్నానని అన్నారు. ఆ రోజు రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందనే విశాలాంధ్ర ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. చరిత్రను వక్రీకరించినా, చరిత్రను ఎవరూ మార్చలేరని ఆయన అన్నారు.