: శ్రీకాకుళం నుంచి పులికాట్ వరకు తెలుగు భాషే ఉంది: సీఎం కిరణ్
సిక్కోలు నుంచి పులికాట్ వరకు తెలుగు భాషే ఉండేదని సీఎం తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని 500కు పైగా సంస్థానాల విలీనం సమైక్యం కోసమే జరిగిందని గుర్తు చేశారు. 1918లో కాంగ్రస్ పార్టీ విశాలాంధ్ర కోసం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. 1920లో కాంగ్రెస్ పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. 1928లో లక్నోలో, 1937లో కలకత్తాలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడాలని నిర్ణయించారన్నారు. 1927లో కాంగ్రెస్ పార్టీ సమైక్యరాష్ట్రం వైపు మొగ్గు చూపిందని ఆయన వివరించారు. 1948లో థార్ కమిషన్ ఏర్పడిందని, జేవీపీ కమిటీ వేశారని చెప్పారు. 1952లో పార్లమెంటులో నెహ్రూ గారు ప్రధానిగా రాష్ట్రాన్ని ప్రకటించారని తెలిపారు. అది కూడా తగదాలేని ప్రాంతాలను తక్షణమే మొట్టమొదట ఆంధ్రరాష్ట్రంగా చేయాలని తెలిపారన్నారు.