: అక్కినేనికి ప్రముఖుల నివాళులు
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంచిన అక్కినేని నాగేశ్వరరావు భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు కొనసాగుతున్నాయి. ఎంపీ టి.సుబ్బిరామి రెడ్డి, తమిళ నటుడు ప్రభు, గాయని పి.సుశీల, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, చంద్రబాబు కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి తదితరులు నివాళులర్పించారు. కాగా, అక్కినేని మృతిపట్ల బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు.