: విశాఖ జిల్లాలో సీఎం, జైరాం పర్యటన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖకు చేరుకుని, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ తో కలిసి గూడెం కొత్తవీధిలో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సందర్శిస్తారు. తర్వాత ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పైలాన్ ను ఆవిష్కరిస్తారు. చింతపల్లిలో 133కేవీ సబ్ స్టేషన్, 100 పడకల ఆస్పత్రి నిర్మాణం, 108, 105 సర్వీసుల ప్రారంభం ఇలా పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం తిరిగి విశాఖకు వచ్చి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
- Loading...
More Telugu News
- Loading...