: తనకెంతో ఇష్టమైన సినిమాను చూసి శాశ్వత నిద్రలోకి జారుకున్న నటసామ్రాట్!
మహానటుడు అక్కినేని చివరిసారిగా తనకు అత్యంత ఇష్టమైన 'మేఘసందేశం' సినిమాను చూశారు. నిన్న రాత్రి ఆయన ఈ సినిమాను చూసిన తర్వాత నిద్రకు ఉపక్రమించి, శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఈ సినిమా ఏఎన్నార్, దాసరి కాంబినేషన్లో వచ్చింది. కమర్షియల్ గా ఈ చిత్రం హిట్ కాకపోయినా... అందరి గుండెల్లో మాత్రం నిలిచిపోయింది. ఈ సినిమాలో కేజే ఏసుదాసు పాడిన పాటలు మనస్సును హత్తుకుంటాయి. చివరిసారిగా అక్కినేని తనకు ఇష్టమైన సినిమానే చూడటం యాధృచ్చికమే!