: అక్కినేనికి తొలి ప్రాధాన్యం వారే
అక్కినేని నాగేశ్వరరావుకు కుటుంబం అంటే ఎనలేని ప్రీతి. కుటుంబ పెద్దగా ఆయన పూర్తి విజయం సాధించారు. తన వారసులను వారికి ఇష్టమైన రంగాల్లో స్థిరపడనిచ్చి వారికి అన్ని రకాలుగా చేయూతనందించారు. చక్కని విలువలతో తుది శ్వాస వరకు ఉమ్మడి కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించారు. చిన్న కుమారుడిగా, మంచి భర్తగా, ఉన్నతమైన తండ్రిగా, ఆదర్శవంతమైన తాతయ్యగా, మంచి మిత్రుడిగా, ఉదాత్తమైన పౌరుడిగా అన్ని రకాలుగా అక్కినేని నాగేశ్వరరావు విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. కుటుంబానికే తొలి ప్రాధాన్యతనిచ్చారు. వృత్తికి, వ్యక్తిగత జీవితానికి తగిన సమతౌల్యాన్ని ఇస్తూ జీవితాన్ని గడిపారని... సినీ విశ్లేషకులతో పాటు ఆయన సమకాలీనులు చాల సందర్భాల్లో గుర్తు చేశారు.