: చివరిసారిగా చూడలేకపోయా: మురళీమోహన్
అక్కినేనిని చివరిసారిగా చూడలేకపోయానని, ఆయనతో మాట్లాడలేకపోయానని నటుడు మురళీమోహన్ ఆవేదన చెందారు. అక్కినేనికి అనారోగ్యంగా ఉండడంతో వారం క్రితం ఆయనను కలుసుకోవాలని అనుకున్నానని, కానీ ఆయన నీరసంగా వున్నారని చెప్పడంతో వెళ్లలేకపోయానన్నారు. ఆ తర్వాత అనుకోకుండా రాజమండ్రి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఈ లోపే ఇలా జరగడంపై ఆయన బాధను వ్యక్తం చేశారు. తన కుటుంబ పెద్దను కోల్పోయినట్లయిందన్నారు. అక్కినేనితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.