: తెలుగు చిత్రపరిశ్రమకు అక్కినేని సేవలు మరువలేనివి: కేంద్రమంత్రి చిరంజీవి
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల కేంద్రమంత్రి చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అక్కినేని చేసిన సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. ఇంకా శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, పీసీసీ అధ్యక్షుడు బొత్స, మంత్రులు వట్టి వసంతకుమార్, డి.కె అరుణ, ఎంపీ లగడపాటి రాజగోపాల్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.