: విప్ ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు..!


ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ను ధిక్కరించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేసే దిశగా కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం. వీరిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని సీఎం వెల్లడించారు. ఒకవేళ ఉపఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాసంతో ఎవరేమిటో తెలిసిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికలను ఏప్రిల్ 25 నుంచి మే మొదటి వారం లోపు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే సాధారణ ఎన్నికలకు గీటురాయి అని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News