: ఇద్దరు గవర్నర్లను ప్రశ్నించేందుకు అనుమతి కోరిన సీబీఐ
సంచలనం సృష్టించిన వీవీఐపీ చాపర్ కేసులో ఇద్దరు గవర్నర్లను ప్రశ్నించేందుకు సీబీఐ రాష్ట్రపతి అనుమతి కోరింది. గవర్నర్ ఎమ్ కె నారాయణ్, బీవీ వాంచూలను ప్రశ్నించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఈ మేరకు దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి చేసింది.