: చిన్నారికి శాపమైన క్షుద్రపూజలు
మూఢ నమ్మకాలతో ఓ చిన్నారిని దారుణంగా శిక్షించారు ఆమె తల్లిదండ్రులు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఓ బాలికను బంధించి, క్షుద్రపూజల పేరిట వాతలు పెట్టారు. భూత వైద్యుడు వాతలు పెట్టి వారం రోజులుగా గదిలో బంధించడంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసి బాలికను ఆసుపత్రికి తరలించారు.