: ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన స్పైస్ జెట్
స్పైస్ జెట్ విమానమాన సంస్థ బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది. ఆ సంస్థ మూడు రోజుల సూపర్ సేల్ ను ప్రకటించింది. జనవరి 21 నుంచి 23వ తేదీ వరకు స్పైస్ జెట్ టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి ప్రయాణ ఛార్జీల్లో 50 శాతం డిస్కౌంట్ ను ఇస్తోంది. సాధారణంగా జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు విమానయాన రంగంలో ప్రయాణికుల తాకిడి తక్కువగా ఉంటుంది. దాంతో, ప్రయాణికులను ఆకట్టుకునేందుకు స్సైస్ జెట్ ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.