: కేజ్రీవాల్ కు మద్దతుపై సరైన సమయంలో నిర్ణయం: కాంగ్రెస్


ఆమ్ ఆద్మీ పార్టీకిచ్చిన బేషరతు మద్దతుపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. ఢిల్లీ పోలీసుల వ్యవహార శైలిని నిరసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళనకు దిగడంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేజ్రీవాల్ రాజ్యాంగాన్ని, పౌరులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు కొనసాగింపుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News