: రాజ్యసభకు పోటీ చేస్తున్న శరద్ పవార్
జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ)అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 24న పవార్ నామినేషన్ దాఖలు చేస్తారని మహారాష్ట్ర ఎన్ సీపీ నేత భాస్కర్ జాదవ్ తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కొన్ని రోజుల కిందట పవార్ వెల్లడించారు. అంటే ఆయన రాజ్యసభ రూట్ లో ఉన్నారని అదే సమయంలో వార్తలు కూడా వచ్చాయి. కాగా, ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.