: ఫేస్ బుక్ లో కూతుర్ని అమ్మేసిన తల్లి
గ్లోబలైజేషన్ పుణ్యమాని క్రయవిక్రయాలన్నీ ఇంటర్నెట్ లోనే జరిగిపోతున్నాయి. ఇంత వరకు వస్తువుల్ని అమ్మి లాభాలు చేకూర్చిన ఇంటర్నెట్ ఇప్పుడు మనుషుల్ని కూడా అమ్ముతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం చిలీలో వెలుగు చూసింది. చిలీలోని వెరోనికా కెరీరా చంపారో(18) అనే యువతి గత ఫిబ్రవరిలో రెండు నెలల గర్భవతి అని తెలుసుకుని తల్లి, సోదరిని సంప్రదించింది. వారిద్దరూ అబార్షన్ లేదా, పుట్టిన బిడ్డను అమ్మేయడం లేదా, పుట్టని బిడ్డను దత్తత అయినా ఇవ్వాలని వారు సూచించారు. దీంతో కెరీరా తన బిడ్డ పుట్టక ముందే ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టింది.
శాంటియాగో ప్రాంతానికి చెందిన ఓ జంట వారిని సంప్రదించి రిజిష్ట్రేషన్ గా 1,15,644 రూపాయలు చెల్లిస్తామన్నారు. నవంబర్ 4న పాప పుట్టగానే అనుకున్న మొత్తాన్ని చంపారోకు చెల్లించి బిడ్డను తీసుకున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి.. చివరకు న్యాయస్థానం వరకు వెళ్లింది. దీంతో, ఈ ఘటనపై జరిగిన విచారణకు చంపారో తల్లి, సోదరి కోర్టులో హాజరయ్యారు. న్యాయమూర్తి స్పందిస్తూ చిలీ చట్టాల ప్రకారం పిల్లలను ఇంటర్నెట్ లో అమ్మడం నేరం కాదని తెలుపడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.