: ధావన్ శతక్కొట్టుడు వెనుక సచిన్ సలహా!
ఆడుతున్న తొలి టెస్టులోనే భారీ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ యువ కెరటం శిఖర్ ధావన్ తన ప్రదర్శనకు సచిన్ ఇచ్చిన సలహానే కారణమంటున్నాడు. ఈ టెస్టు ఆరంభమయ్యే సమయంలో సచిన్.. తనకు భారత జట్టు టోపీ అందిస్తూ, ధైర్యంగా ఆడమని సూచించాడని ధావన్ వెల్లడించాడు.
మూడో రోజు ఆట అనంతరం ధావన్ మీడియాతో మాట్లాడుతూ, సచిన్ చేతుల మీదుగా టోపీ అందుకోవడం మధురానుభూతి అని మురిసిపోయాడు. టోపీ అందిస్తూ సచిన్, 'నువ్వు దేశవాళీ పోటీల్లో బాగా దూకుడుగా ఆడతావని విన్నాం. అంతర్జాతీయ మ్యాచ్ ల్లోనూ అదే జోరు కొనసాగిస్తావని ఆశిస్తున్నాం' అని చెప్పాడట.
ఇక, తాను బాల్యం నుంచి సచిన్ ఆట చూస్తూ పెరిగానని, ఇప్పుడు తన ఆరాధ్య క్రికెటర్ తో కలిసి మ్యాచ్ ఆడుతుండడం స్వప్నం సాకారమైనట్టుగా ఉందని ధావన్ ఆనందం వ్యక్తం చేశాడు.