: అత్యంత ప్రజాదరణ గల ప్రధాని అభ్యర్థి ఆయనే!
2014 సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రకటించిన నరేంద్ర మోడీకి అనుకూలంగా ఓ సర్వే తీపి వార్తను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణగల ప్రధాని అభ్యర్థి మోడీయేనని తాజాగా ఓ ప్రముఖ వార్తా చానల్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. 30 శాతం నియోజకవర్గాలు మోడీకే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడైనట్లు సర్వే పేర్కొంటోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీని 9 శాతం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను 3 శాతం, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను 15 శాతం ఓటర్లు ఇష్టపడుతుంటే, ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ వైపు అత్యంత తక్కువ శాతం ఓటర్లు ఉన్నారు.