: నిజాం పాలనపై గర్విస్తున్నారా?..ఎంత విడ్డూరం!: వెంకయ్యనాయుడు
నిండు శాసనసభలో నిజాం పాలనను కీర్తించడంతోపాటు, అతని కీర్తిని చాటేందుకు గర్విస్తున్నానని అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొనడం సరికాదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు హితవు పలికారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ 'నిజాం లౌకికవాదా? ఎంత విడ్డూరం!' అని విస్మయాన్ని వ్యక్తం చేశారు. నిజాం పాలనపై అంత సుదీర్ఘ ప్రసంగం చేసిన అక్బరుద్దీన్ రజాకార్ల అరాచకాలను ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. తాము గతంలో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు.