: కాల్స్, మెస్సేజ్ లను నిఘాకు దొరకనివ్వని బ్లాక్ ఫోన్


మీ కాల్స్ నిఘాకు దొరకవు. హ్యాకర్లు మీ స్మార్ట్ ఫోన్ లోకి అడుగు పెట్టలేరు. అలాంటి సురక్షిత స్మార్ట్ ఫోన్ 'బ్లాక్ ఫోన్' ను అమెరికాకు చెందిన సైలెంట్ సర్కిల్, స్పెయిన్ కు చెందిన హ్యాండ్ సెట్ తయారీ కంపెనీ గీక్స్ ఫోన్ కలసి తయారు చేశాయి. దీనిలో క్రిప్టోగ్రఫీ అనే టెక్నాలజీ వాడినట్లు కంపెనీలు ప్రకటించాయి. అయితే, క్రిప్టోగ్రఫీ టెక్నాలజీ హ్యాకర్ల బారిన పడకుండా ఎలా రక్షిస్తుందన్న దానిపై స్పష్టత లేదు. వచ్చే నెల బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ ప్రదర్శనలో బ్లాక్ ఫోన్ గురించి కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించనుంది. అమెరికా జాతీయ భద్రతా సంస్థ దేశ, విదేశీ పౌరుల సంభాషణలు, మెస్సేజ్ లను సేకరిస్తున్న తరుణంలో ఇలాంటి ఫోన్ అందుబాటులోకి వస్తే.. వ్యక్తిగత సమచారానికి భద్రత లభించనుంది.

  • Loading...

More Telugu News