: క్షమాభిక్ష పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు


క్షమాభిక్ష పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఖైదీలు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయంలో ఆలస్యం వల్ల మరణశిక్షను జీవితఖైదుగా మార్చేందుకు ప్రాతిపదిక ఉన్నట్లేనని పేర్కొంది. ఏకాంత శిక్ష అనుభవిస్తున్న వారికి మానసిక అస్వస్థత ఉంటేనే మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చని చెప్పింది. మరణ శిక్ష అనుభవిస్తున్న ఇతర ఖైదీలకు ఏకాంతవాస శిక్ష రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. అయితే, క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురయితే 14 రోజుల్లో శిక్ష విధించాలని స్పష్టం చేసింది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురయితే ఖైదీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని తెలిపింది. ఆ ఖైదీలకు న్యాయ సహాయం అందించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News