: సోనియాకు జగన్ సహకరిస్తున్నారు: దేవినేని ఉమ
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమ మరోసారి ఆరోపణాస్త్రాలు సంధించారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న సోనియాకు జగన్ పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. సమైక్య ముసుగులో ఆయన విభజనకు అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. టీబిల్లుపై చర్చ అనంతరం కచ్చితంగా ఓటింగ్ ఉండాల్సిందేనని ఉమ డిమాండ్ చేశారు. ఓటింగ్ జరగకుండా సీఎం కిరణ్ డ్రామాలాడుతున్నారేమో అన్న అనుమానం తమకుందని అన్నారు.