: నిరవధిక దీక్ష చేపడతా: కేజ్రీవాల్ హెచ్చరిక
ఢిల్లీ పోలీసుల వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన దీక్ష రెండో రోజు కూడా కొనసాగుతోంది. రాత్రి చలిలో కూడా ఆయన దీక్షను కొనసాగించారు. రైల్ భవన్ వద్ద కేజ్రీ, ఢిల్లీ మంత్రులు, ఏఏపీ కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించకుంటే, తాము నిరవధిక దీక్షకు దిగుతామని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేజ్రీవాల్ ధర్నా దృష్ట్యా ఇవాళ కూడా ఢిల్లీలో నాలుగు మెట్రో స్టేషన్లను మూసివేయనున్నారు. రైల్ భవన్ మార్గంలో ఎక్కడబడితే అక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో... ప్రజలు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు.