: అసెంబ్లీ ప్రారంభం.. 15 నిమిషాల పాటు వాయిదా
ఈ రోజు ఉదయం శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల తెలిపారు. దీంతో వైకాపా ఎమ్మెల్యేలు బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలంటూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభకు అంతరాయం కలిగించరాదని స్పీకర్ పదేపదే కోరినా వైకాపా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో, సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.