: జైనులకు మైనారిటీ హోదా ఇచ్చిన కేంద్రప్రభుత్వం
జైన మతస్థులకు మైనారిటీ హోదా మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. జైనులకు మైనారిటీ హోదా ఇవ్వాలంటూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. ఈ ప్రతిపాదనను ప్రధాని అంగీకరించడంతో ఇవాళ కేంద్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదించింది.