: 2011 గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని సుప్రీం ఆదేశం
2011 గ్రూప్-1 మెయిన్స్ లో నష్టపోయిన అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఈ మేరకు ఆ ఏడాదిలో పరీక్ష రాసి నష్టపోయిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. 2011లో నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్ లో తప్పులు దొర్లాయంటూ వివాదం రేగడంతో పరీక్ష రాసిన 209 మంది నష్టపోయారు. దాంతో, వారు కోర్టును ఆశ్రయించడంతో పై తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలో హాజరుకాని ఏడువేల మందిని మినహాయించి.. మిగతావారిని ఈసారి నిర్వహించే పరీక్షలో కలపాలని ఆదేశించింది. సుప్రీం తీర్పుపై నష్టపోయిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.