: తిరుపతి బాలాజీ ప్రతిమతో.. పలౌ ప్రభుత్వం ‘ప్రత్యేక నాణేలు’!


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి ఏటా కోట్లాది భక్తులు దర్శించి తరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ తిరుమల క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. తిరుమలేశుని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాక, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్న విషయం విదితమే. తాజాగా, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఓ చిన్న ద్వీపాన్ని పరిపాలిస్తున్న పలౌ ప్రభుత్వం తిరుపతి శ్రీ వేంకటేశ్వరునికి అంకితమిస్తూ.. వెంకన్న ప్రతిమతో రూపొందిన కొన్ని నాణేలను పరిమితంగా జారీ చేసేందుకు నిర్ణయించింది. హిందూ దేవుని ప్రతిమతో విదేశీ ప్రభుత్వం ఈ రకమైన నాణేలు విడుదల చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

ఈ ప్రత్యేక శ్రీవారి నాణేలను స్వర్వోస్కీ స్పటికాలు, చిన్న చిన్న రత్నాలు, వెండి నాణేలను ఉపయోగించి జర్మన్ మింట్ లో తయారు చేయించినట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి వీటిని విక్రయించనున్నట్లు నాణేల అధీకృత వ్యాపారి అలోక్ కె.గోయెల్ తెలిపారు. మొత్తం 11,111 నాణేలను జారీ చేయనున్నట్లు.. ఒక్కో నాణెం విలువను 11 వేల 111 రూపాయలుగా నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం చిన్న చిన్న నాణేలను రూపొందించామని, వాటి విలువను ఐదు డాలర్లు, 20 డాలర్లుగా నిర్ణయించామని ఆయన తెలిపారు. అయితే, చిన్న చిన్న నాణేలను మాత్రం ఏప్రిల్ 16వ తేదీన, చైత్ర పూర్ణిమ నాడు విడుదల చేయనున్నట్లు గోయల్ పేర్కొన్నారు. ఆలయ ఆకారంలో ప్రత్యేకంగా తయారు చేయించిన బాక్స్ లలో నాణేలను ఉంచి, వినియోగదారులకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాపంగా ఈ ప్రత్యేకమైన నాణేలను మార్కెట్ చేసేందుకు గోయల్ కు చెందిన ఏజి ఇంపెక్స్ యూరోపియన్ కంపెనీ 'కాయిన్ ఇన్వెస్ట్ ట్రస్ట్'తో ఒప్పందం కుదుర్చుకుంది.

  • Loading...

More Telugu News