: రాష్ట్రపతి ప్రణబ్ నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చకు గడువు పొడిగింపు అంశం ఇప్పుడు రాష్ట్రపతి ఫ్రణబ్ ముఖర్జీ ముందు ఉంది. దాంతో రాష్ట్రపతి నిర్ణయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.
ముసాయిదా బిల్లుపై చర్చ గడువును పొడిగించవద్దంటూ తెలంగాణ మంత్రులు రాష్ట్రపతికి లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వమని తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరో వైపు బిల్లుపై అభిప్రాయాన్ని తెలిపేందుకు నెల రోజుల పాటు గడువు పొడిగించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్, సీమాంధ్ర నేతలు ప్రణబ్ ముఖర్జీని కోరారు. దీంతో రాష్ట్రపతి ప్రణబ్ నిర్ణయం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.