: లోక్ సభ స్థానాలకు దరఖాస్తులు పెట్టుకోండి: విజయ్ కాంత్
మరో రెండు నెలల్లో జరగనున్న 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు (39సీట్లు), పుద్దుచ్చేరి(1సీటు) లోక్ సభ స్థానాలకు డీఎమ్ డీకే పార్టీ అధినేత విజయకాంత్ దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ రెండు చోట్ల ఉన్న 40 స్థానాలకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోవచ్చని ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ నెల 23 నుంచి దరఖాస్తు పత్రాలు అమ్ముతామని, పూర్తి చేసిన వాటిని ఫిబ్రవరి 1లోగా చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పించాలని తెలిపారు. అయితే, జనరల్ కేటగిరి అభ్యర్థులకు దరఖాస్తు పత్రం ధర రూ.20,000 కాగా, రిజర్వుడు స్థానాల అభ్యర్థుల పత్రం రూ.10,000గా నిర్ణయించినట్లు చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.