: గురువు అవతారం ఎత్తనున్న సచిన్ టెండుల్కర్


సచిన్ తన అనుభవాన్ని తదుపరి తరం క్రికెటర్లకు బోధించనున్నాడు. 11 మంది కుర్ర క్రికెటర్లు భవిష్యత్ బ్లాస్టర్ ఆటగాళ్లుగా మారేందుకు కిటుకులు చెప్పనున్నాడు. ఇందుకోసం అడిదాస్ కంపెనీతో ఒప్పందంపై సచిన్ సంతకం చేశాడు. ఉన్ముక్త్ చంద్, పర్వేజ్ రసూల్, విజయ్ జోల్, మనాన్ వోహ్రా, మన్ ప్రీత్ జునేజా, రష్ కలారియా, చిరాగ్ ఖురానా, అక్షదీప్ నాథ్, వికాస్ మిశ్రా, సర్ఫరాజ్ ఖాన్, అపరాజిత్ బాబాలు సచిన్ వద్ద శిష్యరికం చేయనున్నారు. వీరిలో ఉన్ముక్త్ 2012లో అండర్ 19 వరల్డ్ కప్ చాంపియన్ టీమ్ కు కెప్టెన్ గా వ్యహరించాడు. క్రికెటర్లను ప్రోత్సహించాలన్న అడిదాస్ నిర్ణయాన్ని సచిన్ ఈ సందర్భంగా అభినందించాడు.

  • Loading...

More Telugu News