: నా దగ్గర్నుంచి అబద్ధాలూ చెప్పించలేరు.. హరీష్ రావు నుంచి నిజాలూ చెప్పించలేరు: పయ్యావుల
పయ్యావుల కేశవ్ చర్చ సందర్భంగా తమాషా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. పయ్యావుల ప్రసంగానికి టీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతుండడంతో పయ్యావుల అసహనం వ్యక్తం చేస్తూ 'పదేపదే నా ప్రసంగానికి అడ్డుతగులుతూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని అన్నారు'. హరీష్ రావు మరోసారి అభ్యంతరం తెలుపుతూ కామెంట్ చేయడంతో, ఆయనను ఉద్దేశించి పయ్యావుల మాట్లాడుతూ 'నా దగ్గర్నుంచి అబద్ధాలు చెప్పించలేరు, హరీష్ రావు నుంచి నిజాలు చెప్పించలేర'ని అన్నారు. దీంతో శాసనసభలోని పలువురు నేతల మొహాల్లో చిరునవ్వులు విరిశాయి.