: ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురాలేం: షిండే
డిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలన్న డిల్లీ రాష్ట్ర సర్కారు డిమాండును కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తిరస్కరించారు. కాగా, ఢిల్లీ పోలీసులపై విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, విచారణ నివేదిక వచ్చేవరకు కేజ్రీవాల్ ఓపిక పట్టాలని సూచించారు. అరాచకవాది ఎవరో దేశం మొత్తానికి తెలుసునని షిండే వ్యాఖ్యానించారు.