శాసనసభలో టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ ప్రసంగం అంతా తప్పుల తడక అని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. కేశవ్ మాటల గారడీతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.