: మందుల ఓవర్ డోస్ వల్లే సునంద మరణం?
కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందపుష్కర్ మందులను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే మరణించినట్లు పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యుల అధ్యయనంలో తేలిందని సమాచారం. నిద్రకు, ఆలోచనల నివారణకు ఉపకరించే ఆల్ప్రజోలం మందు అధిక మోతాదులో సునంద తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆమె రక్తంలో ఆల్కహాల్ తీసుకున్న ఆనవాళ్లేమీ కనిపించలేదని సంబంధిత వర్గాల సమాచారం. ఈ మేరకు నేడు వైద్యులు నివేదిక ఇవ్వనున్నారు.